![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -117 లో......నన్ను రామలక్ష్మిని పెళ్లి బట్టల్లో రమ్మనడంలో అర్థం ఏంటని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. మరొకవైపు నేను అక్కడ లేనని అందరు నా గురించి ఏం అనుకుంటున్నారో.. సీతాకాంత్ సర్ తిడుతున్నారేమో.. ఎంత నిందిస్తున్నారో.. పాపం నా కారణంగా ఇదంతా అని రామలక్ష్మి ఏడుస్తుంది. ఆ తర్వాత అమ్మ మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. కాసేపట్లో రామలక్ష్మి లేచిపోయిందన్న నిజం అందరికి తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలో అది చేద్దామని శ్రీలతతో సందీప్ అంటాడు.
వీళ్ళేదో కుట్రలు చేస్తున్నారు నాకు తెలియకుండా మాట్లాడుకుంటున్నారని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత పెద్దాయన సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. పంతులు రమ్మని అంటున్నారని అంటాడు. ఎలా రాగలను.. ఎక్కడ పెళ్లి జరుగుతుందోనని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. నిజం చెప్దామంటే స్వామి వినట్లేదని సీతాకాంత్ అంటాడు. స్వామి చెప్పాడంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని పెద్దాయన అంటాడు. మరొకవైపు రామలక్ష్మిని తీసుకొని రావడానికి శ్రీవల్లి, సుజాత వెళ్తారు. లోపలికి వెళ్లేసరికి అక్కడ రామలక్ష్మి ఉండదు. అక్కడ లెటర్ చూసి రామలక్ష్మి రాసిందని శ్రీవల్లి అందరి ముందుకు వచ్చి.. గదిలో రామలక్ష్మి లేదు. ఈ లెటర్ దొరికిందని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఇందాకే ఉంది కదా అని శ్రీలత అంటుంది. శ్రీలత ఆ లెటర్ చదువుతుంది. నిజమేంటో నీకు నాకు తెలుసు.. నిజం తెలిసాక మీతో కలిసి ఉండలేను. నా దారిన నేను వెళ్లిపోతున్నానని అందులో ఉంటుంది. ఆ మాటలకు అర్ధం ఏంటని మాణిక్యం, సుజాతలు సీతాకాంత్ ని నిలదీస్తారు. సీతాకాంత్ ని అందరు అడుగుతుంటే.. సీత గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారని పెద్దాయన చెప్పబోతుంటే.. సీతాకాంత్ ఆపి.. అసలు ఏం జరిగిందో చెప్పబోతాడు. అప్పుడే రామలక్ష్మి గదిలో ఏదో పాత ఫోన్ కన్పిస్తుంది. అందులో నుండి సీతాకంత్ కు ఫోన్ చేసి అభి కిడ్నాప్ చేసాడని అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఎక్కడ ఉన్నావని సీతాకాంత్ అడుగుతాడు. ఏదో గుడి దగ్గర అని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత నాకు కొంచెం టైమ్ ఇవ్వండి. అన్నిటికి సమాధానం చెప్తానని సీతాకాంత్ చెప్పి.. రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు.
సీతాకాంత్ ఫోన్ మాట్లాడడం విన్న శ్రీలత.. అభి గాడికి చెప్పు సీతకంత్ కు తెల్సింది. జాగ్రత్త పడమని అని సందీప్ కు చెప్తుంది. ఆ తర్వాత అభి రామలక్ష్మి దగ్గరికి వెళ్లి.. నువ్వు అంటే సీతాకాంత్ కి చాలా ఇష్టమే.. నిన్ను అడ్డం పెట్టుకొని వాడి దగ్గర డబ్బులు కొట్టేద్దామని అనుకున్నాను కానీ వాడు నా గురించి తెలుసుకొని నీకు నన్ను దూరం చేసాడు. కానీ ఇంత అందాన్ని ఎలా వదులుకుంటా అంటు రామలక్ష్మికి దగ్గరగా వస్తుంటాడు. దాంతో రామలక్ష్మి భయపడుతుంది. మరొకవైపు రామలక్ష్మి కోసం సీతాకాంత్ వెతుకుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |